Satyanveshana
Chapters
కృతిసమర్పణ సాధారణ పం||ర పుష్య బ|| చవితి శుక్రవారం ఉదయం 9 గం. గుడివాడలో వేంచేసియున్న శ్రీ రుక్మిణి సత్యభామాసమేత వేణుగోపాల స్వామివారికి సన్మాన సంఘ సభ్యుల సమక్షమున గ్రంథకర్త సహాస్ర నామార్చన పూజాదులు చేయించి 'సత్యాన్వేషణ' గ్రంథమును శ్రీవారి పాదపద్మముల నుంచి కృతి స్వీకరింప నర్ధించిరి. వచ్చిన సంఘ సభ్యులు తదితర భక్తులు శ్రీవారి పాదతీర్థ ప్రసాదముల స్వీకరించి ధన్యులైరి. ఆ సాయంత్రం సన్మాన సభ గుడివాడ I.M.A. హాలులో జరిగినది.